కామారెడ్డిలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర
- రోడ్డు మ్యాప్ ఆధారంగా వెళ్లాలి
- ట్రాఫిక్ ఇబ్బoదులు ఉండవు
- జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) మంగళవారం ప్రకటించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా కామారెడ్డి పట్టంలో ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 23 న బుధవారం సాయంత్రం 6:00 గంటల నుండి గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణంలో వాహనాల రాకపోకలకు తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు.
భక్తుల భద్రత, శోభాయాత్ర ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
‘కరీంనగర్ / సిరిసిల్ల వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు:
➡️ సిరిసిల్ల బైపాస్ → NH-44 → టేక్రియాల్ బైపాస్ మార్గం ద్వారా కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించవచ్చు అని తెలిపారు.
*కామారెడ్డి నుండి కరీంనగర్ / సిరిసిల్ల వైపు వెళ్లే వాహనాలు:
➡️ కొత్త బస్టాండ్ → ఇందిరాగాంధీ స్టేడియం → టేక్రియాల్ బైపాస్ → NH-44 → సిరిసిల్ల బైపాస్ మార్గం ద్వారా వెళ్లాలి అన్నారు.
*కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు:
➡️ కొత్త బస్టాండ్ → అశోక్‌నగర్ → రైల్వే గేట్ వరకు వచ్చి,
మార్గం–1:
➡️ కలెక్టర్ కార్యాలయం → గుమస్తా కాలనీ → రామారెడ్డి వైపు వెళ్లవచ్చు.
మార్గం–2:
➡️ ఓం శాంతి భవనం → రాజీవ్‌నగర్ → టీచర్స్ కాలనీ → ఇంద్రనగర్ కాలనీ వైపు వెళ్లవచ్చు అన్నారు.
*హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు:
➡️ యథావిధిగా పాత మార్గం ద్వారానే వెళ్లవచ్చు అన్నారు.
*హైదరాబాద్ / పాత రాజంపేట వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు:
➡️ టేక్రియాల్ బైపాస్ → ఇందిరాగాంధీ స్టేడియం → కొత్త బస్టాండ్ మార్గం ద్వారా పట్టణంలోకి ప్రవేశించవచ్చు.
ముఖ్యమైన సూచనలు
➡️ 23 న బుధవారం సాయంత్రం 6:00 గంటల నుండి నిమజ్జన శోభాయాత్ర పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశం ఉండదు అన్నారు.
➡️ శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదు అని తెలిపారు.
➡️ ట్రాఫిక్ డైవర్షన్లు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయి.
➡️ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ పోలీసులకు సహకరించండి. ➡️ మీ భద్రతే మా బాధ్యత
➡️ మీ సహకారమే గణేష్ నిమజ్జన శోభాయాత్ర విజయానికి బలం అవుతుందన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలు గణేష్ శోభాయాత్ర కు సహకరించాలని కోరారు.