ధర ఉంది.. దిగుబడి లేదు!
- అరకొరగా పత్తి కొనుగోళ్లు షురూ..
- క్వింటాకు రూ.9,500 పైచిలుకు..
- వాతావరణ ప్రభావంతో కుదేలైన పత్తి సాగు..
- పెట్టుబడులు దక్కని దుస్థితి
అలంపూర్, సెప్టెంబర్ 15:మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర పలుకుతున్నా రైతన్నకు (Farmer) మాత్రం ఆ ఆనందం లేకుండా పోయింది.ఖరీఫ్ ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే సమయం వరకు వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో దిగుబడి గణనీయంగా తగ్గింది.దీంతో అలంపూర్ నియోజకవర్గంలో అరకొరగా పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దళారులు పత్తి నాణ్యత బట్టి క్వింటాకు రూ.9,500 పైచిలుకు ధర చెల్లిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
అయితే తక్కువ దిగుబడితో రైతులకు పెట్టుబడులు సైతం పూర్తిగా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు.ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలను నమ్ముకుని అలంపూ ర్, ఉండవల్లి, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, అయిజ, ఎర్రవల్లి మండలా ల్లో రైతులు పెద్దఎ త్తున పత్తి, మిరప పంటలను సాగు చేశా రు.
విత్తనం వేసిన తర్వాత పంటకు కీలకమైన దశల్లో ఆశించిన స్థాయి లో వర్షాలు కురవకపోవడంతో పత్తి మొక్క లు ఎదుగుదల కోల్పోయాయి. కాయలు పట్టాల్సిన సమయంలో తేమ లేక దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.
పంట చేతికందక.. పొలాల్లోనే దున్నేసి..
వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో వందల ఎకరాల్లో పత్తి పం ట ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కొం దరు రైతులు పొలాలను దున్నేయాల్సి వచ్చి ంది. మరికొందరు చేతికొచ్చిన అరకొర పత్తి ని దళారులకు విక్రయిస్తున్నారు.-
ధర ఉన్నా.. దిగుబడి లేక నష్టమే
ప్రస్తుతం పత్తికి క్వింటాకు రూ.9,500 పైచిలుకు ధర లభిస్తున్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. సాధారణంగా ఎకరాకు వచ్చే దిగుబడితో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గడంతో పెట్టుబడి, కూలీ ఖర్చులు, విత్తనాలు, ఎరువుల వ్యయం కూడా రాబట్టలేని పరిస్థితి నెలకొంది. ధర మార్కెట్లో ఉన్నా.. పంట దిగుబడి లేకపోవడంతో రైతన్న చేతిలో మిగిలేది నష్టమే అన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఆదుకోవాలని వేడుకోలు
వాతావరణ ప్రతికూలతలతో పత్తి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.