గిరిజన హామీలను వెంటనే అమలు చేయాలి: ఎమ్మెల్యే సునీతా

16-09-2026 | 11:16am

•ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది

నర్సాపూర్, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(Vakiti Sunitha Laxma Reddy) డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించామని తెలిపారు. తండాలకు విద్యుత్, తాగునీరు, విద్యా సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం గిరిజనులకు ఇచ్చిన హామీలైన పోడు, అసైన్‌మెంట్ భూములకు పట్టాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ప్రైవేట్ రంగంలో ఎస్టీలకు ప్రాధాన్యత వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్పొరేషన్లకు నిధులు పెంచడంతో పాటు ఎరుకల సంఘానికి కేటాయించిన భూమిని వెంటనే అప్పగించాలని కోరారు. గిరిజనుల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ జెడ్పిటిసి భాబ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షులు భోగ శేఖర్, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు