ఆదిభట్ల డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రజినీకాంత్ గౌడ్
ఆదిభట్ల, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): ఆదిభట్ల గ్రామానికి చెందిన పల్లె రజినీకాంత్ గౌడ్(Palle Rajinikanth Goud) ఆదిభట్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ఈ నియామకం చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి చేతుల మీదుగా రజినీకాంత్ గౌడ్ నియామక పత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పార్టీ బలోపేతానికి వచ్చే ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని,ఆదిభట్ల డివిజన్లో కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు EC శేఖర్ గౌడ్ (మామ ),భూపతిగళ్ళ మహిపాల్, రాజు, శ్రీకాంత్ గౌడ్,నర్సింగ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.