పెరిగిన ధర.. ఆలకించరా మొర!

16-09-2026 | 05:30am
  1. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం తీరుతో అవస్థలు 
  2. బిల్లు కంటే అదనంగా రూ.60 వసూలు.. 
  3. హోమ్ డెలివరీలు వట్టిమాటలే.. 
  4. స్టాక్ కొరత పేరుతో వినియోగదారులకు ఆంక్షలు                                           

చింతలపాలెం, సెప్టెంబర్ 15 : గృహ అవసరాల కోసం వినియోగదారులకు అందాల్సిన సేవల విషయంలో స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ (Indane Gas Agency)తీరుపై వినియోగదా రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ ఇం టి వద్దకు హోమ్ డెలివరీ చేయకుండా, ఒక నిర్దిష్ట కేంద్రం వద్దకు వాహనం తీసుకువచ్చి అక్కడి నుంచే సిలిండర్ తీసుకెళ్లాలని సూచిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నా రు.

అలాగే సిలిండర్ పై అదనపు వసూలు చేస్తూ వినియోగదారులపై మరింత భారా న్ని మోపుతున్నారని వినియోగదారులే చెబుతున్నారు. దీంతో పెరిగిన సిలిండర్ ధర.. ఆ లకించరా మా మొర అంటూ పలువురు వి నియోగదారుల ద్వారా వినిపిస్తున్న మాట.

హోమ్ డెలివరీ లేనట్లేనా?  

అంతేకాకుండా, అలా వచ్చి సిలిండర్ తీసుకెళ్లకపోతే ఆర్డర్ను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తు న్నాయి. ఇంటి వద్దకు సిలిండర్ అందాల్సిన సమయంలో వినియోగదారులే వాహనాలతో నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లి సిలిండర్ తీ సుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని వారు ప్రశ్నిస్తున్నారు.

హోమ్ డెలివరీ లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, ఒ ంటరిగా జీవించే మహిళలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ బరువున్న సిలిండర్ను ఏజెన్సీ లేదా నిర్దిష్ట కేంద్రం ను ంచి ఇంటికి తీసుకురావడం వారికి మరింత కష్టంగా మారుతోందని చెబుతున్నారు.

నిల్వ తక్కువ పేరిట వాణిజ్య అవసరాలకు!

 స్టాక్ తక్కువగా ఉందని చెప్పి డొమెస్టిక్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తు న్న ఏజెన్సీ యాజమాన్యం, వాణిజ్య అవసరాలకు మాత్రం అధిక ధరలకు పెద్ద మొత్తం లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ కొరత ఉంటే  వాణిజ్య అవసరాలకు సిలిండర్లు ఎలా, ఏ ధరకు సరఫరా అవుతున్నాయి? అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి.

స్టాక్ కొరత పేరుతో సాధారణ వినియోగదారులను ఇబ్బందుల కు గురిచేస్తూ, అధిక ధరలకు వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అన్నది సంబంధిత అధికారులు విచారణ చేసి తేల్చాల్సిన అవసరం ఉందని వినియోగదారులు కోరుతున్నారు.

రూ.60 అదనపు వసూలు! 

బిల్లులో ఉన్న మొత్తానికి అదనంగా రూ.60 వసూలు చేస్తున్నారని.. ఏ సేవ కింద వసూలు చేస్తున్నారో చెప్పాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుల ఈ కేవైసీ విషయంలో నిబంధనల ను కఠినంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు, హోమ్ డెలివరీ చేయకపోవడం, బిల్లు కంటే అదనంగా వసూలు చేయడం వంటి ఆరోపణలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

యాజమాన్యం చెప్పిన చోటుకెళ్లి తీసుకుంటున్నారు 

వంట చేయాలంటే ప్రతి ఇంట్లో తప్పక గ్యాస్ అవసరం కాబట్టి యాజమాన్యం ఏది చెప్తే అది తప్పక పాటించాల్సి వస్తుంది. అధిక ధరలు వసూల్ చేస్తూ కూడా హోమ్ డెలివరీ చేయడంలేదు. గృహ అవసరం కాబట్టి గత్యంతరం లేక యాజమాన్యం చెప్పిన ధరకి చెప్పిన చోటికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి ఆన్లైన్ ధరకే సిలిండర్, హోమ్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఏ వినియోగదారుడు ఇబ్బందులు పడడు.                

      షేక్ హుస్సేన్ సాహెబ్, సీపీఎం మైనార్టీ నాయకులు, చింతలపాలెం

మరిన్ని వార్తలు