ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన సాగు

16-09-2026 | 11:30am

•తక్కువ పెట్టుబడులతో అధిక ప్రయోజనాలపై రైతులకు అవగాహన

నర్సాపూర్, సెప్టెంబర్ 15: ప్రకృతి వ్యవసాయ(Natural farming) పద్ధతులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడులతో పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ రైతులకు సూచించారు. చిన్న చింతకుంట, జక్కపల్లి గ్రామాల రైతులకు ప్రకృతి వ్యవసాయంపై లింగాపూర్ రైతు వేదికలో సోమవారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రకృతి వ్యవసాయ విధానాలు, కిట్ల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, తక్కువ పెట్టుబడులతో సాగు చేసే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు తమ పొలాల్లో ఆచరించి, నేల ఆరోగ్యంతో పాటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో టీఆర్‌వీకే ప్రధాన శాస్త్రవేత్త డా. సతీష్, వ్యవసాయ సహాయ సంచాలకులు సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, ప్రకృతి వ్యవసాయ వనరుల వ్యక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు