సుద్దవాగు తండా ఘటనపై స్పందించిన ఎంపీ వద్దిరాజు

22-09-2026 | 10:14pm

రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నారని ఏసీపీ స్పష్టీకరణ

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం(Thirumalayapalem Mandal) సుద్దవాగు తండాలో కాంగ్రెస్ నాయకుల కారుపై రాళ్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(Rajya Sabha Member Vaddiraju Ravichandra) స్పందించారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటన అనంతరం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే వారు తిరుమలాయపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఎంపీ పోలీసు అధికారులను వివరణ కోరారు. వారు ఎక్కడికీ తరలించలేదని, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నారని ఏసీపీ స్పష్టం చేసినట్లు ఎంపీ తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వారిని కలుసుకోవచ్చని, విచారణ అనంతరం ఇంటికి పంపిస్తామని ఏసీపీ తెలిపినట్లు పేర్కొన్నారు. చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

మరిన్ని వార్తలు