పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్ నిధులు పెంచాలి..

22-09-2026 | 10:06pm

- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నిధులను మరింత పెంచాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) కోరారు. మంగళవారం మునుగోడులోని సీపీఐ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు.

ప్రజారోగ్యానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర వైద్య చికిత్సలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ మరింత ప్రయోజనం చేకూరేలా నిధులను పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నరసింహ, బచ్చనగోని గాలయ్య, తీర్పారు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు చాపల శ్రీనివాస్, నలపరాజు సతీష్, బొడిగ సైదులు, సత్యం, పాండు, వెంకన్న, కట్కూరు లింగస్వామి, గోపగోని ఉదయ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు