5 September, 2026 | 1:35 AM

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర

04-09-2026 | 10:25pm

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) విమర్శించారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సమరభేరి కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం మహిళలతో సదస్సు, వంటా వార్పు కార్యక్రమం నిర్వహించగా గండ్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ... మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, రైతులకు రూ.15 వేల రైతు భరోసా(Farmer Assurance) వంటి హామీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని మాత్రమే ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు.

గతంలో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రస్తుతం మళ్లీ విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన పరిస్థితి అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు