కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

24-09-2026 | 06:21pm

ఖానాపూర్,(విజయక్రాంతి): దిలాబాదులోని రిమ్స్ వైద్యశాల(RIMS Hospital)లో ఏసీ పేలి ఐదుగురు నవజాత శిశువుల మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని బిఎస్పీ(BSP) జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నవజాత శిశువులు చనిపోతే(deaths of newborns) ప్రభుత్వం సహాయంతో సరిపుచ్చుకోవడం ఆ కుటుంబానికి బాసటగా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఈ ఘటనకు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బి ఎస్ పి పార్టీ వారి పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు