ఏజెన్సీలో వర్షం
24-09-2026 | 06:25pm
ఉట్నూర్,(విజయక్రాంతి): బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనంతో ఏజెన్సీ ప్రాంతం(agency area)లోని గ్రామాల్లో వర్షం కురుస్తుంది. ఉట్నూర్ ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో వర్షం(Rain) కురుస్తుంది. కురుస్తున్న వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే వాగులు పొంగి పొర్లే అవకాశం ఉందని వాగుల పక్కకు ప్రజలు వెళ్లవద్దని రెవిన్యూ అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.