తిరుమల శ్రీవారి చెంతకు కొత్త జంట

13-10-2026 | 11:55am

తిరుమల: సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంట మంగళవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో (Suprabhatam Seva) పాల్గొన్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లి మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను (Theertha Prasadam) అందజేశారు. 

దసరా కానుకగా ‘రణబాలి’

పెళ్లి తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ జంట శ్రీవారిని దర్శించుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ‘రణబాలి’ (Ranabaali Movie) చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.


మరిన్ని వార్తలు