మహిళా సమైక్య భవనానికి భూమి పూజ

29-09-2026 | 03:26pm

మాగనూరు, సెప్టెంబర్ 29: మాగనూరు మండల పరిధిలోని మంది పల్లి గ్రామంలో రూపాయలు 10 లక్షల నిధులతో చేపట్టనున్న మహిళా సమైక్య భవనానికి మంగళవారం సర్పంచ్ రఘునాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు తక్కువ వడ్డి తో రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

మహిళా సమైక్య సభ్యులు ఈ యొక్క భవనాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి, కావలి రంగప్ప, సి సి గంగాధర్, వెంకటేష్, శ్రీనివాసులు, వెంకటేష్, కురుమూర్తి, మహిళా సంఘాల సభ్యులు బుక్కు కీపర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు