రంగంపేట సొసైటీ మహాజనసభ రసాభాస!
29-09-2026 | 05:15pm
సభలో సభ్యుల వాగ్వాదం.. నిర్వహణ తీరుపై నిలదీత
కొల్చారం, సెప్టెంబరు 29: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)(Primary Agricultural Cooperative Society) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజనసభ రసాభాసగా మారింది. సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సభలో సొసైటీ కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తడంతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
సభలో సభ్యుల ప్రశ్నలకు సంబంధించి చర్చ తీవ్రతరమై కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యుల మధ్య వాగ్వాదంతో మహాజనసభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో సభకు హాజరైన రైతులు, సభ్యుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.