మా సారు మాకు కావాలి.. విద్యార్థుల నిరసన

29-09-2026 | 05:18pm

బేల సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): బేల మండలం(Bela Mandal)లోని భేధొడా గ్రామంలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులు నిరసన తెలిపిన నేపథ్యంలో, తాజాగా బేల మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను నిరసిస్తూ గ్రామస్తులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. “మా సారు మాకే కావాలి” అంటూ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వెంటనే డిప్యూటేషన్‌ను రద్దు చేసి ఉపాధ్యాయుడిని తిరిగి పాఠశాలలోనే కొనసాగించాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు