ఇందిరా డైరీ గేదెల సెలక్షన్లో పారదర్శకత పాటించాలి

23-09-2026 | 06:23pm

బీఆర్ఎస్, సిపిఎం ప్రతినిధుల బృందం డిమాండ్

ముదిగొండ, (విజయక్రాంతి): "రెండవ విడత ఇందిరా డైరీ(Indira Dairy) గేదెల మంజూరు చేయడంలో అధికారులు పారదర్శకతను పాటించాలని బుధవారం మధ్యాహ్నం ముదిగొండ వెలుగు కార్యాలయంలో ఏపీఎం కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఏపీఎం తరపున కార్యాలయంలో మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు పెద్దోజు పద్మ కమలాపురం క్లస్టర్ సిసి అనురాధలకు వినతి పత్రం స్వీకరించారు. కమలాపురం సువర్ణపురం గ్రామంలో గేదెల మంజూరులో పార్టీల పరంగా వివక్షత చూపుతూ అధికార పార్టీ వారు చెప్పిన పేర్లు మంజూరు చేస్తున్నారని ఆ గ్రామం నుండి పార్టీ ప్రతినిధులు ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకుని వచ్చారు.

గ్రామంలో ఒక పార్టీకి ఎక్కువ మరో పార్టీకి తక్కువగా ఇస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్లతో వెల్లడించారు. ఎంపీడీవో, ఏపీఎంలు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లెన్స్ పాటించాలని వారు కోరారు. పార్టీలపరంగా విభక్తులు సూపితే మండల స్థాయిలో పెద్ద ఎత్తున వారి వారి కార్యాలయాలు ఎదుట ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు