ప్రజావాణికి 51 దరఖాస్తులు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 51 వినతి పత్రాలు అందాయి. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్(Collectorate AO Chandrasekhar)తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే నెల నుంచి అన్ని శాఖల అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దేవ సహాయం సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.