భగత్‌సింగ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి
డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): దేశభక్తుడు భగత్‌సింగ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్(Thotakura Vajresh Yadav) ఉన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి నందన్ గణేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్‌సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యాక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.