12వ జాతీయ గోండి కోయ భాష ప్రామాణీకరణ
డిక్షనరీ వర్క్ షాప్ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ
ఐటీడీఏ పీవో బి రాహుల్
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): అక్టోబర్, 2 నుండి 6 వరకు 5 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి కోయ, గోండి భాషా ప్రామాణీకరణ(Gondi Koya Language Standardization), డిక్షనరీ వర్క్ షాప్ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. తన చాంబర్లో ఆదివాసి ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ కి ఐటీడీఏ ఆతిధ్య సహకారం అంధిస్తుండగా, జాతీయ గోండి కోయ భాషా ప్రామాణికరణ, డిక్షనరీ, రికగ్నైషన్ సమన్వయ కమిటీ సమన్వయం చేస్తూ ఆర్గనైజ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణతోపాటు, చ్చత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్కండ్, అస్సాం మొత్తం 8 రాష్ట్రాల నుండి సుమారు 120 మంది కోయ గోండి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు.
ఈ వర్క్ షాప్ కి సాధ్యమైనంతవరకు ప్రముఖులతోపాటు అందరిని ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోండ్రు వీరాస్వామి, సీనియర్ కోయ భాషా రిసోర్స్ పర్సన్ పాయం వెంకటరత్నం, కారం దారయ్య, ఇర్ప రాధాకృష్ణ మూర్తి, కాక రాజు, కణితి రామకృష్ణ, వీసాల శ్రీలక్ష్మి, మడివి గురుత్వ, మడివి సూక్ష్మ తదితరులు పాల్గొన్నారు.