కరెంట్ కోతలతో రైతుల అవస్థలు
గద్వాల టౌన్: రైతులకు 24 గంటల ఉచిత,నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విఫలమైందని తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి గొంగళ్ల రంజిత్‌కుమార్ విమర్శించారు. అగ్రహారం సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులతో కలిసి నిరసన చేపట్టి ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. లోఓల్టేజీ,విద్యుత్ కోతలతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రాత్రివేళల్లో కరెంట్ కోసం రైతులు పొలాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి(MLA Bandla Krishna Mohan Reddy) పార్టీలు మారడంపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదని ఆరోపించారు.రైతు బీమా,రుణమాఫీ హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు.విద్యుత్ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చిబాబు,రంగస్వామి,వెంకట్రాములు,విష్ణు,గోవిందు,బలరాం నాయుడు,రవి,సలీం,సుభాష్,లక్ష్మన్న తదితరులు రైతులు పాల్గొన్నారు.