అన్నపూర్ణాదేవిగా బిజినేపల్లి దుర్గామాత
13-10-2026 | 01:31pm
బిజినేపల్లి: మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి దేవస్థానం(Anjaneya Swamy Temple) ఆవరణలో దుర్గా యూత్ ఆధ్వర్యంలో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు(Durga Navratri Celebrations) ఘనంగా నిర్వహించారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. అమ్మవారి పూజల అనంతరం కమిటీ సభ్యులు స్థానిక మహిళలు, యువతుల చేత పలు సాంస్కృతిక కార్యకలాపాలు ఏర్పాటు చేశారు. పూజలు తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.