పోలీస్ అమర వీరులకు ఘన నివాళి
జిల్లా కేంద్రంలో కొవ్వుత్తుల ర్యాలీ
ములుగు, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : పోలీస్ అమరవీరులకు(Police martyrs) శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(Police Commemoration Day) పురస్కరించుకుని, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులర్పించేందుకు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్(Mulugu District SP Sudheer Ramnath Kekan) ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సదానందం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ములుగు బస్టాండ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏరియా హాస్పిటల్ జంక్షన్ వరకు వెళ్లి తిరిగి బస్టాండ్ జంక్షన్ వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటుచేసిన అమరవీరుల ఫ్లెక్సీ వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలను, విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు తెలియజేయడంతో పాటు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సాహసం, అంకితభావాన్ని స్మరించుకోవడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి రవీందర్, ఆర్ఐ స్వామి, శ్రీకాంత్, తిరుపతి, ఎస్హెచ్ఓ వెంకటేష్, ఎస్సై లు చంద్రశేఖర్, రచిత్ర, సాయి కృష్ణ, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.