ఎల్నినో ఎఫెక్ట్.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి!
వెంకటాపురం,నూగూరు అక్టోబర్ 24 (విజయ క్రాంతి): వెంకటాపురం మండలంవ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎం ఏ) ఆధ్వర్యంలో శనివారం మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన ELNINO ప్రభావం- వైవిద్యమైన పంటల సాగు అనే అంశం మీద రైతు వేదిక పాత్ర పురంలో రైతులు, డీలర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏటుర్ నాగారం ఏ డి ఏ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాబోయే రబీ సీజన్లో వరి పంట వేయొద్దని రైతులకు సూచించారు.వరికి బదులుగా ఆరుతడి పంటలు మరియు స్వల్ప కాళికారకాలైన పప్పు ధాన్యాలు నూనె గింజల పంటల వేసే దిశగా రైతులు ఆలోచించాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి నవీన్ మాట్లాడుతూ మండలంలో ప్రధానంగా వరి, మిర్చి, మొక్కజొన్న మాత్రమే సాగు చేస్తున్నారని వీటికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన కందులు, పెసలు,మినుములు ,వేరుశనగ నువ్వులు ,ఆముదం వంటి పంటలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉందని మండల రైతాంగం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పంటలు సాగు చేయాలని కోరారు.
ఆత్మ డైరెక్టర్ మన్యం సునీల్ బాబు మాట్లాడుతూ రైతులు తమ పొలంలో ఒకటే పంట కాకుండా వివిధ రకాల పంటలు పండించాలని సూచించారు.ఈ సమావేశంలో ఆత్మ డైరెక్టర్లు కొండపర్తి సీతాదేవి ,పల్నాటి నాగేశ్వరరావు , ఏఈఓ లు రైతులు, మండల డీలర్లు పాల్గొన్నారు