టైటిల్ ఆపరేషన్ గంగా

07-09-2026 | 05:25am

మళయాల సూపర్ స్టార్ మోహన్‌లాల్(Malayalam Superstar Mohanlal) హీరోగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి విష్ణు మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన చారిత్రాత్మక ఎవాక్యుయేషన్ మిషన్.

జార్జియాలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్‌లో త్వరలో మోహన్‌లాల్ పాల్గొం టారు. పోలాండ్, జార్జియా, కజకిస్థాన్, ఢిల్లీ, డెహ్రాడూన్, కొచ్చి ప్రాంతాల్లో మొత్తం 180 రోజుల పాటు షూటింగ్ జరపనున్నారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్, అదిల్ హుస్సేన్, భాగ్యశ్రీ బోర్సే, పార్తిబన్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: శశ్వత్ సచ్‌దేవ్; డీవోపీ: మిరోస్లావ్ కుబా బ్రోజెక్; యాక్షన్: సే యంగ్ ఓ; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్; ఎడిటర్: షమీర్ మహమ్మద్. 

మరిన్ని వార్తలు