ఆగమనం, నిమజ్జనంలో డీజేలకు నో పర్మిషన్
07-09-2026 | 03:12pm
భిక్కనూర్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): గణేష్ విగ్రహాలను మండపాలకు తీసుకువచ్చే సమయంలో, నిమజ్జనం సందర్భంగా సౌండ్ బాక్స్‌లు, డీజే సిస్టమ్‌లు వినియోగించరాదని భిక్కనూర్ ఎస్ఐ అనిల్(Bhikkanoor SI Anil) తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు, సౌండ్ బాక్స్‌లు ఏర్పాటు చేస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ అనిల్ సూచించారు.
