ప్రేమనే ఒక లోకం ఉందిలే మనకోసం..

13-09-2026 | 05:30am

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్న ఈ సినిమాకు రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం (Director Ramesh Bandreddi) వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌(Arunachala Creations banner)పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇందులో దీపక్, అజయ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘తెలుసా తెలుసా’ అనే ఓ మెలోడీ గీతాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

‘ప్రేమనే ఒక లోకం ఉందిలే మనకోసం.. అందులో కలకాలం జంటగా కలిసుందాం.. చూపులే కలిపేద్దాం.. మాటలే నిలిపేద్దాం.. మాయలో మునకేద్దాం.. హాయిలో పడి లేద్దాం.. ప్రేమ జతలో సాగే పయనం.. దూరమవదే ఏ దూరం.. ప్రేమకథలో రోజూ మధురం.. నేరమవదే ఏ నేరం.. తెలుసా తెలుసా చిలిపి మనసా.. నువు నా యదలో రూపం.. తెలుసా తెలుసా చిలిపి మనసా నువు నా జతలో దీపం..’ అంటూ సాగుతోందీ గీతం.

విజయ్ బుల్గానిన్ స్వరపర్చిన ఈ పాటకు సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించగా, అనుదీప్ దేవ్, లిప్సిక పాడారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ పాటకు అదనపు ఆకర్షణ అనిచెప్పవచ్చు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ప్రొడక్షన్ డిజైన్: చిన్నా. 

మరిన్ని వార్తలు