పోస్టర్ ఆవిష్కరణలో కవిత
ముకరంపుర, అక్టోబర్ 1 (విజయ క్రాంతి)ప్రజారోగ్య సమస్యలపై తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ను టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లాలో ప్రజారోగ్య సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈనెల 6న నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అత్యవసర వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని అవసరమైన మందులు, వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులను మెరుగు పరచాలని సూచించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులలో అనవసర పరీక్షలు ద్వారా అధిక బిల్లులపై కఠినమైన నియంత్రణ ఉండాలని అన్నారు.పేద,మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలను ప్రజా సంఘాలను తెలంగాణ ఉద్యమకారులను ఆరోగ్య నిపుణులను సమాజిక అలోచన సంఘాలను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వనిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు పాల్గొన్నారు.