ఫన్.. అడ్వెంచర్.. ట్రెజర్ హంట్.. ‘సిగ్మా’

18-09-2026 | 07:01pm

సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్- అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’(Sigma ). ఇందులో ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోందీ సినిమా. దీన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ తెలంగాణ, కోస్తాంధ్రల్లో విడుదల చేయనుండగా, ఎన్వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది.

ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో సందీప్ కిషన్(Hero Sundeep Kishan) మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, గుర్తింపు చాలా ఎక్కువ. తెలుగు నటుడిగా బతికిన జీవితమే ఎక్కువ. ఒక తెలుగు హీరోగా నేను చాలా గర్వపడతాను. తమిళ ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణ చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సంజయ్ తెలుగు సినిమాకు చాలా పెద్ద అభిమాని. 70 రోజుల్లో సినిమా తీస్తానని చెప్పి, 63 రోజుల్లోనే పూర్తి చేశాడు. సినిమా అందరికీ వినోదం పంచుతుంది” అని తెలిపారు.

కథానాయకి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “సిగ్మా’తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నా. తమిళ్‌లోనే డబ్బింగ్ చెప్పాను. పక్కా కమర్షియల్ సినిమాలాగా, చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరికీ వినోదం పంచుతుంది” అని తెలిపింది. దర్శకుడు  జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. అడ్వెంచర్ ఉంటుంది. ఒక ట్రెజర్ హంట్ లాంటి సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న ఫన్ రైడ్‌లా ఉంటుందీ చిత్రం” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మైత్రీ శశిధర్‌రెడ్డి తదితర చిత్రబృందం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు