టెక్సాస్‌లో నవంబర్ 13 నుంచి 15 వరకు ఐడీఎఫ్‌యూ

13-10-2026 | 05:05am
  1. భారతీయ వైవిధ్యాన్ని చాటే ప్రదర్శనలు
  2. చీఫ్ క్యూరేటర్ దాంజి తోటపల్లి

హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఇండికా(Indica) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఇండిక్ ఫిలమ్స్(Center for Indic Films) (సీఐఎఫ్) నిర్వహిస్తున్న ‘ఇండికా డల్లాస్ ఫిల్మ్ ఉత్సవ్(Indica Dallas Film Festival)’ (ఐడీఎఫ్‌యూ) నవంబర్ 13 నుంచి 15-2026 వరకు టెక్సాస్‌లోని ది కాలనీ, గ్రాండ్స్‌స్కోప్‌లో ఉన్న గెలాక్సీ థియేటర్‌లో(Galaxy Theatre) జరగనుంది. భారతీయ కథా వైవిధ్యాన్ని, సానుకూల సందేశాన్నిచ్చే సినిమాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల ఉత్సవంలో ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీలు(Documentaries), షార్ట్ ఫిల్మ్స్‌తో(Short Films) పాటు దర్శకులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సెంటర్ ఫర్ ఇండిక్ ఫిలిమ్స్ చీఫ్ క్యూరేటర్, సహ వ్యవస్థాపకుడు దాంజి తోటపల్లి మాట్లాడుతూ..  భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతుల్లోని గొప్ప కథలను విస్తృత ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఇండికా డల్లాస్ ఫిల్మ్ ఉత్సవ్ ప్రధాన ఉద్దేశం. అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహించడంతో పాటు, దర్శకులు, కళాకారులు తమ సృజనాత్మకతను పంచుకునేందుకు, పరస్పరం ఆలోచనలు మార్పిడి చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని అన్నారు.

నవంబర్ 13న రెడ్ కార్పెట్ కార్యక్రమం అనంతరం సంతోష్ దవాఖార్ మరాఠీ చిత్రం గోంధల్ ప్రదర్శన, ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. నవంబర్ 14న పలు చిత్రాల ప్రదర్శన, 15న డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనలు, దర్శకులు, నటీనటులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారి కోసం నవంబర్ 12న యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ నిర్వహిస్తారని తోటపల్లి వివరించారు.

మరిన్ని వార్తలు