ఉత్తమ నటుడు నాగచైతన్య.. ఉత్తమ నటి ఐశ్వర్య రాజేశ్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) _South Indian International Movie Awards )2026 వేడుకలు కర్ణాటకలోని బెంగళూరు కోరమంగళ ఇండోర్ స్టేడియం (Bangalore Koramangala Indoor Stadium)వేదికగా అట్టహాసంగా జరిగాయి. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ఉత్సవం రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 12, 13) నిర్వహించారు. తొలిరోజు శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేశారు.
రెండో రోజు ఆదివారం తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల ప్రతిభావంతులకు అవార్డులు అందజేశారు. తెలుగు చిత్ర సీమకు సంబంధించి ఈ ఏడాది అవార్డుల్లో ‘మిరాయ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు ప్రధానంగా దూసుకెళ్లాయి. ముఖ్యంగా యంగ్ హీరో తేజ సజ్జా వరుసగా రెండో ఏడాది కూడా ఉత్తమ నటుడిగా నిలిచి సత్తా చాటగా, నటి ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటిగా డబుల్ ధమాకా సాధించారు.
మంచు మనోజ్ భావోద్వేగం:
‘మిరాయ్’ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో అద్భుతంగా నటించి అవార్డు అందుకున్న మంచు మనోజ్ స్టేజిపై భావోద్వేగానికి గురయ్యారు. తాను విలన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన చిత్రానికి, అది కూడా సినిమా విడుదలైన సరిగ్గా ఏడాదికి అదే తేదీన అవార్డు అందుకోవడం విశేషమంటూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. కన్నడ ఇండస్ట్రీ తరఫున ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి సైతం తొలిరోజు వేడుకల్లో ప్రధాన అవార్డు అందుకున్న వారిలో నిలిచారు.
తెలుగు విజేతల జాబితా..
ఉత్తమ నటుడు: నాగచైతన్య అక్కినేని (తండేల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (మిరాయ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేశ్ (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): చందు మొండేటి (తండేల్)
ఉత్తమ ప్రతినాయకుడు: మంచు మనోజ్ (మిరాయ్)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సహాయ నటుడు: సత్యదేవ్ (కింగ్డమ్)
ఉత్తమ సహాయ నటి: శ్రద్ధా శ్రీనాథ్ (డాకు మహారాజ్)
ఉత్తమ హాస్య నటుడు: బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ నేపథ్య గాయని: సమీరా భరద్వాజ్ (కోర్ట్)
ఉత్తమ గేయ రచయిత: పూర్ణాచారి (కోర్ట్)
ఉత్తమ పరిచయ నటుడు: హర్ష్ రోషన్ (కోర్ట్)
ఉత్తమ పరిచయ నటి: శ్రీదేవి (కోర్ట్)
ఉత్తమ పరిచయ నటి: సాక్షి మడోల్కర్ (మోగ్లీ)