అదరగొట్టిన అమ్మాయిలు, అబ్బాయిలు
ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత్ హవా
పురుషుల, మహిళల ఆసియా కప్ కైవసం
మోకీ, సెప్టెంబర్ 13: జూనియర్ హాకీ(Junior Asia Cup Hockey)లో భారత్ దుమ్ము రేపింది. అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు అదరగొట్టేశారు. పురుషుల, మహిళల హాకీ రెండింటిలోనూ విజేతగా నిలిచింది. పురుషుల జూనియర్ హాకీలో సౌత్ కొరియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో అన్మోల్ ఎక్కా బృందం.. 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
తద్వారా టైటిల్‌ను నిలబెట్టుకున్న భారత జట్టు.. వరుసగా నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన ఘనత సాధించింది. మొత్తంగా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. భారత్ తరఫున అజిత్ యాదవ్ తొమ్మిదో నిమిషంలో.. అన్మోల్ ఎక్కా 13వ నిమిషంలో.. ప్రభ్దీప్ సింగ్ 21వ నిమిషంలో.. అషూ మౌర్య 50వ నిమిషంలో గోల్స్ చేశారు. సౌత్ కొరియా తరఫున లీ మిన్హెయోక్ (54వ నిమిషం)లో ఏకైక గోల్ కొట్టాడు.
అంతకు ముందు మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు.. చైనాపై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. యూత్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో భారత జట్టు.. ఆసియా కప్ గ్రూప్ దశలో మూడు గెలిచి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. తద్వారా టాపర్‌గా నిలిచింది. ఇక సెమీఫైనల్లో మలేషియాను 3-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఆసియా టైటిల్ గెలవడంతో పాటు జూనియర్ హాకీ ప్రపంచకప్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు అమ్మాయిలు కూడా సత్తా చాటారు.
జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఈ ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని మోకీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. టైటిల్ పోరులో సనికా చంద్రకాంత్ పదిహేడో నిమిషంలో గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది. ఈ క్రమంలో ఆధిక్యంలో వెళ్లిన భారత జట్టు.. ఆ తర్వాత చైనాకు గోల్ కొట్టే అవకాశం ఇవ్వకుండా నిలువరించింది. తద్వారా 1- తేడాతో గెలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇక ఈ విజయంతో భారత మహిళల జూనియర్ జట్టు.. ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది.