చరిత్ర సృష్టించిన ధీరజ్

14-09-2026 | 05:05am

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం

మెక్సికో, సెప్టెంబర్ 13: ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో(Archery World Cup Final) ధీరజ్ బొమ్మదేవర(Dhiraj Bommadevara) స్వర్ణం గెలిచి, తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో జపాన్‌కు చెందిన నకానిషి జున్యాను ఓడించాడు. 2023, 2024 ఎడిషన్‌లో ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన 25 ఏళ్ల ప్రపంచ నంబర్ 10 ఆర్మీ క్రీడాకారుడు, ఈసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదు సెట్ల పోరులో ప్రపంచ నంబర్ 20 నకానిషిని 6- (28 28- 29- 28- 28 తేడాతో ఓడించాడు. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. 

మరిన్ని వార్తలు