నందమూరి వారసుడికి జోడీగా..?

13-09-2026 | 05:30am

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మోక్షజ్ఞ నటించనున్న తొలిచిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయమై చిత్రబృందం ఆమెతో చర్చలు జరుపుతోందని ఫిలింనగర్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara)ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథాంశంతో రూపకల్పన అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మోక్షజ్ఞ సరసన కథానాయికగా శ్రీలీల పేరును చిత్రబృందం పరిశీలిస్తోంది. శ్రీలీల అద్భుతమైన డాన్స్, నటన నైపుణ్యాలు ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలవుతాయని భావిస్తున్నారట టీమ్.

ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించనున్నారని భోగట్టా. తండ్రీకొడుకులు ఇద్దరినీ ఒకే తెరపై చూడటం అభిమానులకు పెద్ద పండుగ లాంటి విషయమే. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు