'కాకా'లో బాలీవుడ్ స్టార్ హీరో

25-10-2026 | 01:32pm

చిరంజీవి ‘కాకా’లో అనిల్ కపూర్?.. నెట్టింట హాట్ టాపిక్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ (Kaaka) గురించి ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కాశ్యప్ ఇప్పటికే కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా మరో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ (Anil Kapoor) కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి Official Confirmation రాలేదు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, అనిల్ కపూర్ ఈ సినిమాలో పరిమిత నిడివి ఉన్న పాత్రలో కనిపించే అవకాశం ఉందట. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, కథలో ఆ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి, అనురాగ్ కాశ్యప్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొనగా, అనిల్ కపూర్ పేరు తెరపైకి రావడంతో ఈ మూవీపై చర్చ మరింత పెరిగింది. అయితే ఆయన నిజంగానే సినిమాలో నటిస్తున్నారా? ఆయన పాత్ర ఎలా ఉండనుంది? అనే ప్రశ్నలకు అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత రానుంది.

మరోవైపు ‘కాకా’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ దాదాపు 85 శాతం పూర్తయినట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలోగా Shootingను ముగించాలని Makers లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. KV​​N Productions బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గతంలో చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Action, Entertainment అంశాలతో తెరకెక్కుతున్న ‘కాకా’ నుంచి రాబోయే Updates కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అనిల్ కపూర్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు