డ్వాక్రా మహిళల భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
ఈ భవనం మహిళల సమావేశాలకు, స్వయం సహాయక సంఘాల (Self Help Groups) ముఖ్య కార్యకలాపాలకు ఉపయోగపడనుంది. డ్వాక్రా మహిళలకు అవసరమైన వసతులు కల్పించడంలో భాగంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పీసీసీ సభ్యుడు మద్దిశెట్టి సత్యప్రసాద్, గ్రామపంచాయతీ సర్పంచ్ ఇస్లావత్ శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ కుంపటి వేణు, మారగాని నాగేశ్వరరావు, వార్డు సభ్యురాలు కాసిన కుమారి, కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.