చీకటి ప్రపంచాన్ని బయటపెట్టే పంచనామా

09-09-2026 | 05:25am

ఒక మరణం వెనుక దాగిన నిజం కోసం మొదలైన వేట.. చివరకు ఎలాంటి చీకటి ప్రపంచాన్ని బయటపెడుతుందో తెలియాలంటే మా ‘పంచనామా’ను చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్(Actor Bharath Srinivasan) (‘ప్రేమిస్తే’ మూవీ ఫేమ్) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే ఈ ‘పంచనామా’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన వెబ్‌సిరీస్ ఇది. ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిడ్డే విజయేంద్ర మౌళి, ఉదయ భాను నిర్మించారు.

సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముగ్గురి మరణాలను యాక్సిడెంటల్ డెత్‌గా పేర్కొంటూ కేసు మూసేసిన పోలీసులకు పునఃదర్యాప్తు కోసం ఫిర్యాదు అందుతుంది. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? ఆ హంతకుడి మోటీవ్ ఏంటీ? అనే అంశాలతో 6 ఎపిసోడ్స్‌తో రూపుదిద్దుకుందీ సిరీస్. శివాజీరాజా, మేధారెడ్డి, చరణ్‌బాబు, రూపలక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు సంగీతం: నరేశ్ కుమారన్; ఛాయాగ్రహణం: సందీప్ కాంత్ ఎన్; ఎడిటర్: శ్రీనివాస్ బైనబోయిన. 

మరిన్ని వార్తలు