మూసీ ల్యాండ్ పూలింగ్ గ్రామసభలు
ఈనెల 24, 26వ తేదీలలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ల్యాండ్ పూలింగ్ పై గ్రామసభలు
ఘట్ కేసర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఈనెల 24, 26వ తేదీలలో జరగనున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ల్యాండ్ పూలింగ్ పై(Musi Riverfront Development Land Pooling) గ్రామసభల షెడ్యూల్ వివరాలను తహసిల్దార్ చంద్రశేఖర్(Tehsildar Chandrashekhar) శుక్రవారం వెల్లడించారు. ఈనెల 24 తేదీన (శనివారం) ఎదులాబాద్ లో రైతు వేదిక వద్ద మధ్యాహ్నం 3గంటలకు గ్రామసభ జరుగుతుందన్నారు. అలాగే 26వ తేదీన (సోమవారం) కొర్రెములలో పాత గ్రామపంచాయతీ వద్ద ఉదయం 11 గంటలకు, ప్రతాపసింగారం, కాచవానిసింగారం, ముత్తివెల్లిగూడ గ్రామాలకు ప్రతాపసింగారం రైతు వేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటలకు గ్రామసభలు జరుగుతాయని తహసిల్దార్ చంద్రశేఖర్ తెలియజేశారు.