గుంతలమయమైన రోడ్డుకు మోక్షమెప్పుడు?

30-09-2026 | 04:12pm

మల్లాపూర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి నుంచి మందాటి మీదుగా సోమేశ్వర స్వామి కమాన్ వరకు ఉన్న సీసీ రోడ్డు (CC Road) గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్‌రెడ్డి కోరారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రహదారి ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారిందని తెలిపారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల కారణంగా వాహనదారులకు నడుము నొప్పి వంటి ఇబ్బందులు (Travel Problems) ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. దీంతో కాలినడకన వెళ్లేవారు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి (Road Safety) నెలకొందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఏనుగు వెంకట్‌రెడ్డి కోరారు. శాశ్వత మరమ్మతులు (Permanent Repairs) చేపట్టే వరకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు

మరిన్ని వార్తలు