గ్రంథాలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు డ్రైవ్
జిల్లా మాజి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్
మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 25(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్(Medchal Municipal) పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ(District Library Authority) వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమ క్యాంపు(Graduate Voter Registration Camp) నిర్వహించడం జరిగిందని మేడ్చల్ జిల్లా మాజి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమ క్యాంపు(Graduate Voter Registration Camp) నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ మల్లికార్జున స్వామి పాల్గొన్నట్లు చెప్పారు.పట్ట భద్రుల నమోదు కార్యక్రమానికి వందల సంఖ్యలో పాల్గొన్నట్లు భాస్కర్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజి కో ఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి.మున్సిపల్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణు చారి.నవీన్ యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
1)మేడ్చల్ పట్ట భద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు..