కలెక్టరేట్ లో గణనాధుని శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించాలి
భక్తి భావం ఉప్పొంగేలా పూజా కార్యక్రమాలు నిర్వహణ
అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్ ఉద్యోగులకు, సిబ్బందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించి బొజ్జ గణపయ్యకు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్(District Collector Pratima Singh) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గణనాథుడికి పుష్పాలు సమర్పించి, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో సాగాలని ఆకాంక్షించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం .. గణనాథుడి నిమజ్జనం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అన్నదాన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ విజయలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ అధికారిని సింధు, కలెక్టరేట్ కార్యాలయ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.