ఆరోగ్యశ్రీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అంతొల్ల సురేష్
పాపన్నపేట: రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్(Rajiv Aarogyasri Employees Union) రాష్ట్ర నూతన కమిటీ కొలువుదీరింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశానికి 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా గిరి యాదయ్యను రెండోసారి ఎన్నుకోగా, ఆయన ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అంతొల్ల సురేష్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన అధ్యక్షుడు గిరి యాదయ్యకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ యూనియన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.