నాణ్యమైన విత్తనాల ఎంపికతో అధిక దిగుబడులు

03-10-2026 | 08:26pm

రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సతీష్

నర్సాపూర్: రైతులు(Farmers ) నాణ్యమైన విత్తనాల ఎంపికతో అధిక దిగుబడులు సాధించవచ్చు అని రైతు విజ్ఞాన కేంద్రం(Farmers Knowledge Centre) ప్రధాన శాస్త్రవేత్త సతీష్ పేర్కొన్నారు. నర్సాపూర్, శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో శనివారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదికలో విత్తన సహకార సంఘాల బలోపితంపై నాబార్డ్(NABARD) సహకారంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

నాణ్యమైన విత్తనాల(Quality Seeds) ఎంపిక, knm1638 రకంతో అధిక దిగుబడులు వస్తాయని రైతులకు సూచించారు. విత్తనోత్పత్తిలో పాటించాల్సిన ఎడబాటు దూరం, కేలి మొక్కల ఏరువేత, కలుపు నివారణతో పాటు వరిలో వచ్చే కాండం తొలుచు చూపు, సుడిదోమ నివారణపై పలు సూచనలు చేశారు. పిఎసిఎస్ సంచాలకులు   రాజు యాదవ్, సహాయ సంచాలకులు శివకుమార్ మాట్లాడుతూ విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకటస్వామి, మధు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు