ఎమ్మెల్యేల్సీ మధుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

08-09-2026 | 11:58pm

బెల్లంపల్లి, (విజయక్రాంతి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేల్సీ తాత మధు పై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎం హెచ్ డీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్ చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి BRS MLC Tata Madhu చేసిన వ్యాఖ్యలను మాదిగ హక్కుల దండోరా(MHD)తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.

రాజ్యాంగ బద్ధమైన  స్పీకర్ పదవిలో ఉన్న ఒక దళిత బిడ్డ అయిన గడ్డం ప్రసాద్ తల్లి ని ఉద్దేశించి  సంస్కార హీనంగా మాట్లాడారని మండిపడ్డారు. తాత మధు పై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అతన్ని ఎమ్మెల్సీ పదవి నుండి తక్షణమే బర్తరప్ చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తున్నదన్నారు. ఒక దళితుడు ఉన్నత స్థాయిలో ఉంటే చూసి ఓర్వలేని అగ్రకుల నాయకులు ఇంత నీచంగా మాట్లాడడం దారుణమని వాపోయారు. 

BRS పార్టీ ఆది నుండి దళిత వ్యతిరేక పార్టీ అని, గతంలో తాటికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్ ను అవమానించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత BRS అధినేత కేసీఆర్ బాధ్యత వహించి ఎమ్మెల్సీ తాతా మధు ను BRS పార్టీ నుండి వెంటనే బహిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు