అట్టహాసంగా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు

20-09-2026 | 07:16pm

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ లో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Tilak Walkers Welfare Association)ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు (Master Athletics Competitions) అట్టహాసంగా  జరిగాయి. ఈ పోటీలను బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై రామకృష్ణ లు, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన  క్రీడాకారులు యువకుల వలె అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమ అన్నారు.

క్రీడలతో  మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సీనియర్ క్రీడా కారులు యాదండ్ల నర్సయ్య, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు  క్రీడల పిడిలు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు