వినాయకునికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ భద్రారెడ్డి ప్రత్యేక పూజలు
20-09-2026 | 08:13pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చామకూర భద్రా రెడ్డి(BRS State leader Dr Bhadra Reddy) బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సందర్శించి, విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పలు మండపాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మండపాల నిర్వాహకులు, భక్తులు, యువతతో మమేకమై వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.