ఎల్ ఓ సి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

20-09-2026 | 08:06pm

నిర్మల్ సెప్టెంబర్ 20 ( విజయ క్రాంతి): అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన LOC చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Yeleti Maheshwar Reddy)అందజేశారు. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామానికి చెందిన దండుగుల వర్షిని కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.1 లక్షల LOC చెక్కును అందజేశారు. అదేవిధంగా ఖానాపూర్ మండలం సుర్జాపుర్ చెందిన ఏలిశేట్టి మల్లయ్య కుటుంబానికి వైద్య చికిత్స నిమిత్తం రూ 1.50 లక్షలు LOC చెక్కును అందజేశారు.

ఆపద సమయంలో తమ కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు