ఘనంగా సీవీ రామన్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు

03-10-2026 | 10:16pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో(CV Raman Degree College) నూతన విద్యార్థులకు(Students') స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను(Freshers' Day celebrations) శనివారం మంచిర్యాలలోని వైఆర్ పటేల్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో(Cultural programs) అందరినీ అలరించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా పలు వినోదాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు దేశ రక్షణలో సైనికులు చేస్తున్న సేవలను, వారి త్యాగాలను ప్రతిబింబిస్తూ అద్భుతమైన ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఎంతో అవసరమని అన్నారు. ఈ లక్షణాలను అలవర్చుకున్న విద్యార్థులు జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ ప్రతాప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు