జిల్లా కార్యదర్శిగా చంద్రకాంత్ నియామకం
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి(National BC Rights Struggle Committee) జిల్లా కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా(Mancherial District) జైపూర్ మండలం రామారావుపేటకి చెందిన పెద్దల్ల చంద్రకాంత్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ నియామకపు ఉత్తర్యులు శనివారం జారీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత కొంత కాలంగా బీసీ ఉద్యమాలలో(BC movements) పని చేస్తూ బీసీ భావజాల వ్యాప్తిగా సంఘ నిర్మాణంలో భాగంగా నియమిచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా పెద్దల్ల చంద్రకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించిన జిల్లా కార్యవర్గానీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీ ఐక్యతకు, బీసీ హక్కుల సాధనకై నిర్విరామంగా కృషి చేస్తూ బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు.