శాంతి ఖనిలో ఏఐటీయూసీ ధర్నా

04-11-2026 | 12:16pm

బెల్లంపల్లి: కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలపైనా శాంతిఖని గని వద్ద ఏఐటీయూసీ(AITUC) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షతనా జరిగిన ఈ ఆందోళనకు  ముఖ్య అతిథిగా బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్(Branch Assistant Secretary Dasari Tirupati Goud)  హాజరు అయ్యారు.

ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించి ఎక్కడి వారికి అక్కడే హాస్పిటల్ లో invalidation చేయాలనీ,TG జెన్ కో, ట్రాన్స్కో నుండి రావాల్సిన రూ. 59వేల కోట్ల వెంటనే సింగరేణి కంపెనీకి ఇవ్వాలనీ, మైన్స్ మీద మెటీరియల్ కొరటాలేకుండా సరిపడు పని ముట్లు ఇవ్వాలనీ, పార్క్స్ పై ఇన్కమ్ టాక్స్ ను సర్కులర్ రిలీజ్ చేయాలని, సొంత ఇంటి పతకాన్ని వెంటనే సింగరేణి కార్మికులకు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. అనంతరం శాంతి ఖని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్, మంతెన భాస్కర్, అమ్జాత్ ఖాన్, రాజేశం, బుచయ్య, మైన్స్, సేఫ్టీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు