ఫుట్‌బాల్‌లో మెరిసిన గురుకుల విద్యార్థులు

10-10-2026 | 06:02pm

బెల్లంపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభ చాటారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డి. వినాయక్, పదో తరగతి విద్యార్థి కోట సాయి రోహిత్ అండర్‌-17 పాఠశాల క్రీడా సమాఖ్య రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అకిడి విజయసాగర్ తెలిపారు.

ఈ నెల 4న బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో (Football Tournament) ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లోని సెయింట్ మార్క్స్ టౌన్ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్ తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సీవోఈ బెల్లంపల్లి పాఠశాల అధ్యాపక బృందం ఆకాంక్షించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపింది (Congratulations). ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు